Tuesday, 31 January 2017

విడుదలకు ముందే వంద కోట్లు!


తమిళస్టార్‌ హీరో సూర్య నటించిన 'సింగం-3' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల తర్వాత విడుదలకు ముందే వంద కోట్లు బిజినెస్‌ సాధించిన సినిమాగా నిలిచి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా వంద కోట్ల రూపాయలు ఆర్జించినట్టు నిర్మాత జ్ఞానవేల్‌ రాజా వెల్లడించాడు. 
ఇప్పటికే ఎన్నోసార్లు విడుదల తేదీలు మారిన రికార్డు కూడా ఈ సినిమా పేరిటే ఉంది. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment