'దేశముదురు'తో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ప్రస్తుతం తెలుగులో దూకుడు తగ్గించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు అని సవివరంగా చెప్పుకొచ్చింది. తమిళంలో చాలా సినిమాలు చేతిలో ఉండటం వల్లే. తెలుగు పరిశ్రమకు కొంత కాలంగా దూరమయ్యాయని హీరోయిన్ హన్సిక తెలిపింది. ఇప్పడు తాను నటించిన 'లక్కున్నోడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని. అలాగే జయం రవితో కలసి నటించిన తమిళ సినిమా 'భోగన్' కూడా తెలుగులోకి అనువాదం అవుతోందని చెప్పింది.
మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని. ఈ సినిమాలో తానూ చేస్తోన్న పాత్ర ఇంత వరకు చేయలేదని చెప్పింది. మహిళా ప్రాధాన్యత గల పాత్రలను చేయడానికి తనకు ఇంకా చాలా టైమ్ ఉందని, తన వయసు ఇంకా పాతికేళ్లే అని.

 
No comments:
Post a Comment